‘చిన్నారి పెళ్లికూతుర్ని’ సేవ్ చేసిన దిశ

-

హైదరాబాద్ శివారులో ఉండే దిశను అత్యంత అమానుషంగా  హత్యాచారం చేయటం తెలిసిందే. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం నేపథ్యంలో ఏపీలోని మహిళలు.. బాలికల రక్షణ కోసం జగన్ సర్కారు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా మరే రాష్ట్రం.. ఆ మాటకు వస్తే దిశ ఘటన జరిగిన తెలంగాణలో లేని రీతిలో ఏపీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. దిశ యాప్ పేరుతో తీసుకొచ్చిన సాంకేతికత తాజాగా ఒక చిన్నారి పెళ్లికూతుర్ని సేవ్ చేసింది.

విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామానికి చెందిన ఒక చిన్నారికి బలవంతంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు వారి తల్లిదండ్రులు. దీంతో.. ఈ ఉదంతంపై దిశ ప్రత్యేక అధికారిక దీపికా పాటిల్ కు ఒక ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన ఆమె రంగంలోకి దిగారు. ఆ చిన్నారికి ఇంకా పద్దెనిమిదేళ్లు నిండలేదన్న విషయాన్ని ఆమె చదువుతున్న స్కూల్ సర్టిఫికేట్ల ద్వారా గుర్తించారు. వెంటనే బాలికకు ధైర్యం చెప్పి.. పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులకు పోలీసు కౌన్సెలింగ్ ఇచ్చారు.

దీంతో.. ఈ నెల 13న జరగాల్సిన పెళ్లి కాన్సిల్ అయ్యింది. మైనర్ బాలికకు పెళ్లి చేయటం నేరమని.. చట్టంలోని అంశాల్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలిసేలా చెప్పటంతో పాటు.. కేసుల వలయంలో చిక్కకోవద్దని చెప్పటం.. వారిపై ప్రభావాన్ని చూపించింది. దిశ పేరుతో నెలకొల్పిన యాప్.. ఈ రోజు ఒక మైనర్ బాలికకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు

Read more RELATED
Recommended to you

Latest news