AP DSC Posts: మెగా డీఎస్సీకి చంద్రబాబు సర్కార్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. నిన్న మూడున్నర గంటలపాటు సమావేశమైన ఏపీ మంత్రి వర్గం…ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు కెబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్ కు కెబినెట్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్దరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే…. జిల్లాల వారీగా DSC పోస్టుల ఖాళీలు కూడా రిలీజ్ చేశారు.
జిల్లాల వారీగా DSC పోస్టుల ఖాళీలు
16,347 DSC పోస్టులకు జూలై 1న షెడ్యూల్ విడుదలకానుంది. జిల్లాలు, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖ 1134, తూ. గో 1346, ప. గో 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంత 811, కర్నూలు 2678 ఖాళీలు ఉన్నాయి. రేషిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన, స్కూళ్లలో 2,281 పోస్టులు ఉన్నాయి.