ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీనామా

-

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రితో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా శాఖల వారీగా ప్రక్షాళన చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అన్యాయాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సర్కార్​ నియమించిన కొంతమంది ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెలవుల్లో పంపిస్తుండగా మరికొంత మంది అధికారులు, నేతలు తమకు కేటాయించిన పదవులకు గుడ్ బై చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ రాజీనామా చేశారు. ఆయన్ను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. జగన్‌ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని వలవన్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news