ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు బిగ్ అలర్ట్. రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అర్హత సాధించిన రైతులు పోర్టల్ లో నమోదుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ హరి కిరణ్ తెలిపారు. అర్హత ఉండి తొలి విడతలో డబ్బులు పొందని వారు సంబంధిత పత్రాలను రైతు భరోసా కేంద్రాలలో అందించి నమోదు చేసుకోవాలని ఆయన సూచనలు చేశారు.
ఈ పథకం కింద రైతులకు 13,500 ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో 7500 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుండగా… మోడీ ప్రభుత్వం 6000 చొప్పున అందిస్తోంది. కాగా పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ 6000 రూపాయలను మూడు విడుదలలో అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మూడు విడుదలలో 2000 చొప్పున… కేంద్రం డబ్బులను విడుదల చేస్తుంది.అయితే, ఏపీలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అర్హత సాధించిన రైతులు పోర్టల్ లో నమోదుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది.