ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఉద్యోగులకు కరోనా సోకి మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులలో ఒకరి ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. కరోనా వైరస్ సోకి చనిపోయిన ఉద్యోగి పోస్టుకు సమానమైన లేదా.. తక్కువ స్థాయి పోస్టు గానీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది. కరోనా సోకి మరణించింన ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను బట్టి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు సూచించింది. ఈ కారుణ్య నియామకాలలో ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసే సమయంలో కొంత మందిని గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కూడా నియమించాలని కలెక్టర్ల కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.