అగ్రిగోల్డ్ భూముల కేసు దెబ్బకి సబ్ రిజిస్ట్రార్ల అక్రమాల పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం హయంలో పోస్టింగ్ లు తెచ్చుకుని రెండేళ్లకు పైగా అక్కడే ఉన్న వారిపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తుంది ప్రభుత్వం. రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా తనిఖీలతో అమాత్యుల ఆశీస్సుల కోసం పైరవీలు చేస్తున్నారు కొందరు రిజిస్ట్రార్లు. అయితే అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలకంగా వ్యవహరించిన సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
అయితే గతంలో ఇబ్రాహీం పట్నం రిజిస్ట్రార్ గా పనిచేసిన సింగ్ కూడా ఏసీబీ దాడుల సమయంలో పరారీలోనే ఉన్నాడు. బెజవాడ, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో రిజిస్ట్రార్ల పై వచ్చిన ఫిర్యాదుల పై నివేదిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. అలాగే ఏసీబీ కేసుల్లో పట్టుబడి సస్పెండ్ అయినా కొందరు రిజిస్ట్రార్లు కోర్టు ఆదేశాలతో విధులు నిర్వహించినట్టు గుర్తించారు. దాంతో ఆయా స్థానాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం.