ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు ఏపీ సిఎం జగన్ వైద్య ఆరోగ్య అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలు చేయాలనే ప్రతిపాదనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు అన్ని ఆస్పత్రిల్లో సిబ్బంది ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని ఎదుర్కొవడానికి ముందుస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రయివేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేయాలని అన్నారు. అలాగే రాష్ట్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకునేలా అవగాహాన కల్పించాలని అన్నారు. అలాగే ఫీవర్ సర్వేను పక్కగా నిర్వహించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల బూస్టర్ డోస్ పై ప్రకటన చేయడంతో దాని కోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.