మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

-

పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమానికే తన ప్రథమ ప్రాముఖ్యం అని చెప్పిన జగన్.. ఆ దిశగానే తన పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో… పేదింటి అక్కల కోసం “వైఎస్ఆర్ చేయూత” పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జగన్. ఏపీ మంత్రివర్గ భేటిలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు. అధికారిక వర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45-60 ఏళ్లు కలిగిన మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీల్లో 15.26 లక్షల మంది, మైనార్టీ లలో 1.40 లక్షల మంది ఉన్నారు.

అంటే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ది పొందనున్నారన్నమాట. ఈపథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ఖర్చు చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news