దీనికి సమాధానం చెప్పు జగన్ : దేవినేని..!

-

కరోనా నేపధ్యంలో బయటకి రాలేని నాయకులు ఇంట్లోనే కూర్చొని ట్విట్టర్ వేదికగా రాజకీయాలు చేస్తున్నారా..? ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఇదే ఇదే అనుమానం కలుగుతుంది ఎవరికైనా. అప్పుల బాధను తట్టుకోలేక ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినని ఉమ జగన్ సర్కార్ పై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘బతకాలని ఉంది, వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పులపాలయ్యా. తాగుబోతును, తిరుగుబోతును కాదు. సాగు కోసమే అప్పు చేశా’ అంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని… రైతులు, కౌలు రైతుల మాటలు తాడేపల్లిలోని రాజప్రసాదానికి వినపడుతున్నాయా చెప్పండి జగన్ గారూ? అని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘చేదోడు’ పథకంపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికీ లబ్ధి అని హామీలు గుప్పించారని… ఇప్పుడేమో ‘షాపులు ఉంటేనే’ అని మాట మార్చారని విమర్శించారు. కార్పొరేషన్లను రద్దు చేశారని… లక్ష రూపాయల రాయితీని  రూ. 10 వేలకు కుదించారని దుయ్యబట్టారు. నామమాత్రంగా ఉన్న ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ ను కూడా తరలించారని అన్నారు. ఇదేమి ‘చేదోడు’ అని 137 బీసీ కులాలు అడుగుతున్నాయని… జగన్ గారూ సమాధానం చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే అరటిరైతులను ముంచి సీఎం నియోజకవర్గం నుంచి అరటి దిగుమతి చేస్తున్నారని. రైతులను మార్కెట్ శక్తులకు ప్రభుత్వం వదిలేసిందని. రైతులు కేజి రూ.2నుండి4కు అమ్ముకుంటూ నష్టాలుభరించలేక పంటను పొలాల్లోనే వదిలేస్తుంటే పులివెందులలో మాత్రం అరటికి రూ.20 చెల్లించారు. ఇదెక్కడి న్యాయమని అడుగుతున్న రైతులకు సమాధానం చెప్పండి. అంటూ సీఎం జగన్ ని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news