ఏపీలో పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ ప్రకటించింది. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 పట్టణాల నుంచి నీటి అవసరాల కోసం 4 . 482 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. మహేంద్ర తనయ నుంచి పలాసకు, ఏలేరు కాల్వ నుంచి నర్సీపట్నం, గొల్లప్రోలు, ముమ్మిడివరం పట్టణాలకు నీటి సరఫరా జరగనున్నట్టు పేర్కొన్నారుది.
అలానే కృష్ణా నది నుంచి తిరువూరు, నందిగామ, ఉయ్యారు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలకు నీటి సరఫరా జరపాలని నిర్ణయించింది ప్రభుత్వం. బుగ్గవాగు నుంచి మాచర్ల, పిడుగురాళ్ల కు జవహర్ కుడి కాల్వ నుంచి వినుకొండకు నీటి సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రామతీర్ధం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చీమకుర్తి, కనిగిరికి నీటి సరఫరా చేయనుంది. మొత్తంగా 50 పట్టణాల్లో 5,00 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తోంది ఏపీ సర్కారు.