వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ !

ఏపీ ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపుల మీద అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విడతల వారీగా మూడు బకాయిలను చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి విడతల వారీగా డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనున్నది. రెండో డీఏను జూలై, 2021 నుంచి మూడో డీఏను జనవరి 2022 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

jagan
jagan

2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు మూడు డీఏలు పెండింగులో ఉన్నాయి. అయితే 2020 జనవరి నుంచి రావాల్సిన డీఏను కేంద్రం వాయిదా బాతుయదు. దీంతో ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీతం బకాయిల చెల్లింపుల్లో మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో కలిపి ప్రభుత్వం చెల్లించనున్నది. డీఏ బకాయిల విడుదల, పెండింగ్ జీతాల క్లియరెన్సుతో సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేస్తోంది.