హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా.. T20ల్లో తొలి జట్టుగా రికార్డు

-

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు జింబాబ్వేపై మూడో టీ20లో విక్టరీ ద్వారా పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు అద్భుతమైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 230 టీ20లు ఆడిన టీమ్ఇండియా.. రికార్డు స్థాయిలో 150 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్థాన్‌ 142 విజయాలతో రెండో స్థానంలో ఉంది.

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన టాప్-5 జట్లు ఇవే

 

భారత్ – విజయాలు 150 (ఆడిన మ్యాచ్‌లు 230)

పాకిస్థాన్‌ – విజయాలు 142 (ఆడిన మ్యాచ్‌లు 245)

న్యూజిలాండ్ – విజయాలు 111 (ఆడిన మ్యాచ్‌లు 220)

ఆస్ట్రేలియా – విజయాలు 105 (ఆడిన మ్యాచ్‌లు 195)

దక్షిణాఫ్రికా – విజయాలు 104 (ఆడిన మ్యాచ్‌లు 185)

Read more RELATED
Recommended to you

Latest news