బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ..!

-

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చా లని మాక్ పోలింగ్ వద్దని పిటిషన్ వేశారు బాలినేని. అయితే ఇవాళ బాలినేని తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు జడ్జి మెంట్ ప్రకారం ఈవీఎం, వీవీ ప్యాట్లను లెక్కించి సరిపోల్చాలని కోరాం. అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ నిర్వహిస్తోంది. పోలింగ్ కు ముందే మాక్ పోలింగ్ ఒకటికి రెండు సార్లు మెషీన్లు సామర్థ్యం చూసేందుకు చేపడతారు.

ప్రీ మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు మళ్ళీ పోస్ట్ మాక్ పోలింగ్ చేయటం సుప్రీం తీర్పుకు విరుద్ధం. దీనివల్ల పిటిషనర్ కోరుతున్న విధంగా ఓట్ల లెక్కింపు సరిపోల్చటం కుదరదు. ఓడిపోయిన వ్యక్తి ఓటర్లు ఈవీఏంలలో వేసిన ఓట్లు వీవీ ప్యాట్లు గా మారినపుడు అవి కూడా సరిపోయినపుడు మాత్రమే సంతృప్తి చెందుతారు. అలా కాకుండా మాక్ పోలింగ్ చేయటం వల్ల ఏం తేలదు. ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కు అనుగుణంగా మాత్రమే ఇక్కడ వ్యవహరించాల్సి ఉంది అని బాలినేని తరఫున న్యాయవాది తెలిపారు. అయితే ఈ పిటిషన్ లో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news