వాళ్లను కూడా బయటకు పంపండి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. నిన్న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు.. దేశ భద్రత గురించి ట్వీట్ చేశారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని తెలిపారు.
చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారు, కొందరు నేరాలు మరియు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలు అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదని కోరారు.
देश में रह रहे अवैध प्रवासी न केवल सुरक्षा के लिए बड़ा खतरा बन चुके हैं, बल्कि सामाजिक ताने-बाने को भी नुकसान पहुंचा रहे हैं। कई लोग बदले हुए नामों से रह रहे हैं, तो कुछ अपराधों और राष्ट्रविरोधी गतिविधियों में लिप्त हैं। यह स्थिति देश की शांति और सुरक्षा के लिए गंभीर चुनौती है।…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2025