YSRCP leader Kodali Nani’s arrest: వైసీపీ నేత కొడాలి నాని అరెస్ట్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ నేత కొడాలి నాని అరెస్ట్ వార్తలను ఖండించారు ఏపీ పోలీసులు.
కోల్‌కతాలో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కానీ కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు నిరాధారమంటున్నారు ఏపీ పోలీసులు. అటు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఊహించని పరిమాణం ఎదురు అయింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అస్వస్థత నెలకొంది. గుంటూరు జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో మాజీ ఎంపీని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది సిబ్బంది. నందిగం సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్న చెప్పటం లేదని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు.