మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు హర్ష కుమార్. ఈ తరుణంలోనే హర్ష కుమార్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. స్వచ్ఛ దారాలు ఉంటే తీసుకొని దర్యాప్తుకు రావాలని నోటీసులో.. స్పష్టం చేశారు రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి.

అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదని.. కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా గత నాలుగు రోజుల కిందట పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.