ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణలో జరగనుంది. పార్టీ ఫిరాయించిన పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కేసు ఇవాళ విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. ఈ విచారణలో ఇప్పటికే గులాబీ పార్టీ వాదనలు పూర్తిగా ముగిసిపోయాయి. నాలుగు వారాల్లో గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని గులాబీ పార్టీ తరఫు లాయర్లు కోరడం జరిగింది.

ఇక ఇవాళ, స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు విననుంది సుప్రీంకోర్టు. ఈ వాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం… పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని… చెబుతున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.