ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు ICMR నిర్ధారించి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.

కుటుంబసభ్యులను విచారించగా చిన్నారి విధి కుక్కలతో ఎక్కువగా ఆడుకునేదని, చికెన్ ముక్కలు కొట్టే సమయంలో పాప అడిగితే కొన్ని సార్లు పచ్చి మాంసం ఇచ్చామని, అప్పటినుండే పాప అనారోగ్యం పాలైందని చెప్పారు చిన్నారికి జ్వరం, మూర్ఛ, విరోచనాలు అవ్వడంతో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మార్చి 16న మృతి చెందింది.