తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన రేషన్ డీలర్లు… తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లతో దశాబ్దాల తరబడి కమీషన్ విధానం మీద పనిచేయించుకుంటున్నారని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అన్ని రాష్ట్రాలలో అమలు జరుగుతుందా లేదా అని చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని తెలిపారు.
ఏపీ లో రేషన్ పంపిణీ భాధ్యత నుండి డీలర్ను పక్కన పెట్టి యండియు ఆపరేటర్లను తీసుకొచ్చారని ఆగ్రహించారు. యండియు ఆపరేటర్లకు జీతంతో పాటు ఖర్చులు ఇస్తున్న ప్రభుత్వం డీలర్కు మాత్రం కమీషన్ ఖర్చులు భరించాలనే పద్ధతి అమలు చేయడం దారుణం అని నిప్పులు చెరిగారు.
గోడౌన్ నుంచి మాకు బియ్యం పంపి.. యండియూలకు మాత్రం ప్రతి బస్తా కాటా వేసి అవ్వాలనడం అన్యాయమని చెప్పారు. పౌరసరఫరాలశాఖ లో కొంతమంది అధికారులు నిర్ణయాలు డీలర్ల వ్యవస్థను నీరుగార్చే లా ఉందని ఆగ్రహించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దోరణి మార్చుకోకుంటే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 2 న దేశ రాజధాని ఢిల్లీలో 5.5 లక్షల మంది రేషన్ డీలర్లతో భారీ నిరసన చేపడతామని జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు.