చంద్రబాబును చూసి వానదేవుడూ పారిపోతాడు – చెల్లుబోయిన వేణుగోపాల్

-

చరిత్రలో ఎప్పుడూ రానంతగా వరదలు వచ్చాయన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ప్రతి విషయాన్ని రాజకీయం కోసం వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని… ఏరియల్ సర్వే పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ గతంలో చంద్రబాబు చేసినట్లు హెలికాప్టర్‌లో విహార యాత్రలు చేయటం లేదని.. చంద్రబాబును చూసి వానదేవుడూ పారిపోతాడని చురకలు అంటించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.

పిల్లలకు పాలు లేవు అంటున్నారు…పాపం లోకేష్ ఏడుస్తున్నట్టు ఉన్నాడు పాలు లేవని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాగ్రహ వరదలో చంద్రబాబు ఎప్పుడో కొట్టుకు పోయాడని.. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఏరియల్ సర్వే చేశారన్నారు. ఈ సారి 256 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని.. కోటి 64 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామని స్పస్టం చేశారు. చింతూరులో 10 వేల మందికి భోజనం వండించి వరద బాధితులను పంపిణీ చేస్తున్నామని.. టీడీపీ నాయకులు ఎక్కడా వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వం సూక్ష్మంగా ఆలోచించి అన్ని చర్యలు తీసుకుంటున్నా చంద్రబాబుకు కనిపించటం లేదని ఆగ్రహించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.

Read more RELATED
Recommended to you

Latest news