ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రార్ కార్యాల యాల్లో 2.0 సాప్ట్ వేర్ అమలుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. రేపటి నుంచి విడతల వారీగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలో కొత్త సాఫ్టు వేర్ అమలుకు ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. రేపు విశాఖ, అనకాపల్లి, నంద్యాల, తిరుపతిలో 2.0 ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుంది.
ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తి కావటంతో అక్కడ కూడా 2.0 ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి శ్రీకాకుళం, నెల్లూరు, భీమవరం, కడపలో రిజిస్ట్రార్ కార్యాల యాల్లో 2.0 సాప్ట్ వేర్ అమలు కానుంది. ఈ నెల 20 నుంచి విజయనగరం, ఏలూరు, పుట్టపర్తి, నరసరావు పేట లో ప్రారంభం అవుతుంది. ఈ నెల 27 నుంచి మన్యం, రాజమండ్రి, బాపట్ల, గుంటూరు, అల్లూరి జిల్లా, చిత్తూరు..వచ్చే నెల 4 నుంచి కాకినాడ, కోనసీమ, ఒంగోలు, రాయచోటి, అనంతపురం, కర్నూలు అమలు కానుంది.