పంచాయతీకో కార్యదర్శి దిశగా ఏపీ సర్కార్‌ కసరత్తు

-

పంచాయతీకో కార్యదర్శి దిశగా ఏపీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. 500 జనాభా కంటే మించిన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండనున్నారు. గ్రేడ్-5 కార్యదర్శులను నియమించి వారికి ప్రభుత్వం DDO అధికారాలు కల్పించనుంది.

AP Sarkar’s move towards Panchayat Secretary

గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శులకు ఉన్న అన్ని అధికారాలు వీరికి వర్తిస్తాయి. హెడ్ క్వార్టర్ పంచాయతీలో గ్రేడ్ 1, 2, 3, 4 కార్యదర్శులు ఒకరు ఉంటారు. సమీప కార్యదర్శులు ఇన్చార్జ్ గా ఉంటారు. అలాగే, ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని…. త్వరగా ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదును పూర్తి చేయాలంది. అటు పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంకు అకౌంట్లు లింక్ చేయనివారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news