AP: మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

-

AP: మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన మార్క్స్ మెమో ఆన్ లైన్ లో ఉంటుంది…మైగ్రేషన్ కు అప్లై చేసిన వారికి కూడా ఆన్ లైన్ లోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్ధులకు పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి… అదే PEN సిస్టమన్నారు.

ఈ నంబర్‌ తో విద్యార్ధి వివరాలు అన్నీ ఇవ్వడం జరుగుతుందన్నారు. పర్మనెంటు నంబరుతోనే అన్ని వివరాలు ఉంటాయి..ఈ విద్యా సంవత్సరం నుంచీ PEN ను అమలులోకి తెస్తున్నామని వెల్లడించారు.
దేశంలోనే PEN ను అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news