ఏపీ వాలంటీర్లు ఇంద్రకిలాద్రి అమ్మవారికి వద్దకు వచ్చారు. తమ సమస్యలను ఆ అమ్మవారికి నివేదించారు. ఈ క్రమంలో వాలంటీర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వున్న వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని 5 నెలలుగా వేడుకుంటున్నప్పటికి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు అని ఆయన పేర్కొన్నారు.
అయితే మేము ఏ పార్టీకి సంబందించిన వ్యక్తులం కాదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్ప ఏ పార్టీకి పనిచేయడానికి మాత్రం కాదు అని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపి అధ్యక్షురాలు పురంధేశ్వరి మనసు మార్చి వాలంటీర్లు సమస్యలు పరిష్కరించే విధంగా మమ్మల్ని దీవించాలి అని అమ్మవారిని వేడుకున్నాము. ప్రభుత్వం మనసు మార్చుకోపోతే కచ్చితంగా న్యాయస్థానంకి వెళ్తాము. మాకు ఎవరైతే వాగ్దానం చేశారో వారిని కూడా న్యాయస్థానం మెట్లు ఎక్కిస్తాం అని ప్రెసిడెంట్ లంకా గోవిందరాజులు పేర్కొన్నారు.