వల్లభనేని వంశీ పై తప్పుడు కేసు పెట్టారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. వంశీ సంగతి తేల్చుతా. నియోజకవర్గంలోంచి బయటికి వెళ్లివేస్తానని వల్లభనేని వంశీని రెచ్చగొట్టాడు పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా చంద్రబాబు పట్టాబిని నేరుగా గన్నవరానికి పంపారు. గన్నవరంలో వంశీని తిట్టాడు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పోగు చేసిన మనుసులను వెంటబెట్టుకొని వంశీని తిట్టి ఫిబ్రవరి 20న వైసీపీ కార్యాలయం పై దాడి చేయడం కోసం పట్టాభి బయలుదేరాడు.
దళిత సర్పంచ్ శీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి.. వాళ్ల మనుషులు దాడి చేశారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి చేశారని మాజీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్తన్ చెప్పాడు.