వల్లభనేని వంశీ పై తప్పుడు కేసు పెట్టారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. చంద్రబాబు కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు.
పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరని చెప్పారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచాది నీచంగా మాట్లాడారు. పట్టాభి, ఆయన అనుచరులు ఓ దళిత నేత పై దాడి చేశారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారు. మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. సత్య వర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడట.. ఎవ్వడో చూశాడంట.. డబ్బును లాక్కొని పోయాడని తప్పుడు కేసు పెట్టించారు.