గత ఎలక్షన్స్ లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మీడియా ముందు ఎక్కువగా కనిపించని.. మాజీ మంత్రి కోడలి నాని తాజాగా కొన్ని సెటైర్స్ అనేవి వేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్ పై మాట్లాడుతూ.. ఇవ్వని మాములు విషయాలు అని చెప్పిన నాని.. ఆ తర్వాత అప్పట్లో మా గవర్నమెంట్ ఉండేది కాబట్టి యాక్టివ్ గా ఉన్నాం.. ఇప్పుడు యాక్టివ్ గా ఉంది ఏం చేయాలి అంటూ మాట్లాడారు.
అలాగే ప్రస్తుతం మా ఉద్యోగాలు అనేవి పీకేసారు.. అందుకే ఇలా ఉంటున్నాము అని చెప్పారు. ఇక రెడ్ బుక్ లో వంశీ తర్వాత మీ పేరే ఉంది అని చర్చలు నడుస్తున్నాయి అని అడిగిన ప్రశ్నకు.. నేను రెడ్ బుక్ చూడలేదు.. మూడు కాకపోతే 30 కేసులు పెట్టిన భయపడేది లేదు అంటూ పేర్కొన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు కోడలి నాని.. ఎంత యాక్టివ్ గా ఉండేవారో నామకు తెలిసిందే.