ఎన్నికల హడావుడి ముగిసింది… ఇక సంక్షేమమే అంటున్న జగన్ !

ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపధ్యంలో పాలన మీద, సంక్షేమ పధకాల మీద సీఎం జగన్ ఫోకస్ చేయనున్నారు. దీంతో వచ్చే నెలలో వరుస కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏప్రిల్ కార్యక్రమాల షెడ్యూల్ ని సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన, ఏప్రిల్‌ 13న వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం కానుందని జగన్ పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు.

jagan
jagan

వాలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరించాలని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలన్న జగన్, అది వారికి మరింత ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ఏప్రిల్‌ 16న రైతులకు వైయస్సార్‌ సున్నావడ్డీ డబ్బులు వేస్తామని, ఏప్రిల్‌ 20న రైతులకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. అలానే ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన ప్రారంభిస్తున్నామని అన్నారు.