ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఓ వేదిక : సీఎం చంద్రబాబు

-

ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఓ వేదిక అని ఆంధ్రప్రదేశ్  సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభ పక్ష సమావేశం ప్రారంభమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహం, తాజా రాజకీయ పరిణాలపై చర్చిస్తున్నారు. నిన్న BAC లో చీఫ్ విప్, విప్ ల ప్రస్తావనను చంద్రబాబు తీసుకురాగా.. ఎవ్వరినీ నియమిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నెలకొంది.

కేంద్ర బడ్జెట్ లో కూడా ఏవిధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పని చేయాలనే ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు.. కానీ మనకు బాధ్యత ఉంది అని సూచించారు సీఎం చంద్రబాబు. మనం ప్రజలకు జవాబు దారిగా పని చేద్దామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version