సోషల్ మీడియా అరెస్ట్ లపై జగన్ రియాక్షన్..!

-

చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలు కోసం 73 వేల కోట్లు కావాలి. కానీ కేటాయింపులు బడ్జెట్ లో చేయకుండా మోసం చేసినందుకు 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని వైసీపీ అధినేత YS జగన్ ప్రశ్నించారు. ఇదే విషయంపై నేను ట్వీట్ పెడుతున్నాను. మా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వారు, క్యాడర్ కూడా ట్వీట్ పెడతారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తాను అని అన్నారు.

ఒకవేళ అరెస్టు అంటే ముందు నా దగ్గరకి రావాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని కోరుతున్నాను. ఇన్ని విషయాలు అసెంబ్లీలో చెప్పాలంటే మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకుండా ఉండటానికి మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించటం లేదు. ప్రజల గొంతు వినపడకూడదు అని ఈ విధంగా చేస్తున్నారు. అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు ఇలానే మా ఎమ్మెల్యేలు నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తాను అని YS జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version