వైసీపీ నేతల అరెస్టులపై జగన్ కు హోంమంత్రి కౌంటర్..!

-

వైసీపీ నేతల అరెస్టులపై జగన్ కు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయి. కానీ వైసీపీ నేతలు ఈ కేసుల పై గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని ప్రశ్నించిన హోంమంత్రి.. రాజకీయ ముసుగులో వచ్చిన వైసీపీ నాయకుల గురించి ప్రజల ముందు ప్రభుత్వం ఉంచుతుంది.

అయితే గతంలో వాళ్ళ పార్టీ లోనే ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు పై అప్పట్లో వాళ్ళు పెట్టింది అక్రమ కేసు కాదా అని అడిగిన హోంమంత్రి.. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము. మీ మాదిరి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం లేదు. డిజిటల్ కార్పోరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని చేసి ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారు. అయితే రాయలసీమలో అడపిల్లలను ఎవరైనా ఎమన్నా అంటే ఊరుకోరు. కానీ జగన్ ఏం చేస్తున్నాడు. తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని కోర్టులకు వెళ్తున్నారు అని అన్నారు హోంమంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version