ఏపీలో మరోసారి జగనే సీఎం: వేణుస్వామి

-

ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణుస్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 79 సీట్లల్లో వైసీపీ వన్ సైడ్‌గా గెలుస్తోందని.. 30 నుంచి 40 సీట్లల్లో టఫ్ ఫైట్ ఉంటుందని వేణుస్వామి తెలిపారు. 95-125 సీట్ల వరకు YCP విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వ్యాఖ్యానించారు.

Astrologer Venu Swamy Says YS Jagan Will Became AP CM

ఇక అటు ఏపీలో ఎవరికి వారే అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని ట్వీట్ చేశారు. కాగా, వైసీపీ ముఖ్య నేతలు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పాలన అంధించిన జగన్‌ను ప్రజలు మరోసారి ఆదరిస్తారని చెబుతున్నారు. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని.. ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news