ఏసీబీ రైడ్స్ లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సీఐ, ఎస్సై..!

-

ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మొన్నటి మొన్న భద్రాచలం డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ శాఖలో పని చేసే పలువురు.. విద్యుత్ శాఖలో పని చేసే వారు ఇలా చాలా మంది లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ చేతికి చిక్కుతున్నారు.

తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ రైడ్స్ విధించింది. ఈ రైడ్స్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్న సంఘటన చోటు చేసుకుంది. కుషాయిగూడ పోలిస్టేషన్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి, ఎస్సై షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేసేందుకు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ల్యాండ్ కేసు విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం. జోక్యం చేసుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడి లంచం తీసుకోవడం నేరమని ఏసీబీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news