రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది : సీపీఐ నారాయణ

-

తెలంగాణ అస్తిత్వానికే ముప్పుకలిగేలా అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌, తెలంగాణ సమాజం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ తొలగింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేసింది.

రాష్ట్ర చిహ్నం మార్పుపై కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సీపీఐ పార్టీ కీలక నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమన్నారు. కానీ రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు. సంగీతంలో బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం లేవనెత్తడం సరికాదన్నారు. మోడీ ధ్యానం చేయడం.. కన్యాకుమారిని కలుషితం చేయడమే అన్నారు. కేంద్రంలో మోడీ రాకపోతే.. చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news