సేవ్ ఉత్తరాంధ్రనే టీడీపీ నినాదం…టీడీపీది ఒకటే మాట.. ఒకటే బాట.. అది అమరావతి అని కుండ బద్దలు కొట్టి చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజల మధ్య విద్వేషాలకే మూడు రాజధానులంటున్నారు… ఇలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. పాలనా వికేంద్రీకరణకు నాందీ పలికిందే ఎన్టీఆర్ అని.. ప్రజల వద్దకు పాలన కార్యక్రమంతో అధికారులను ప్రజల ముంగిటకు తీసుకెళ్లింది చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు లేడని ధర్మానే చెప్పారు… మంత్రి పదవి రాక ముందు వరకు మూతికి గుడ్డ కట్టుకున్నారు ధర్మాన అని మండిపడ్డారు.
ధర్మాన మాటలు చాలా స్వీటుగా చెబుతారు…తన భూ దొపిడీని కాపాడుకునేందుకే ఉత్తరాంధ్రపై ధర్మాన ప్రేమ ఒలకపోస్తున్నారని ఆగ్రహించారు. మూడు రాజధానుల చేసే హక్కు రాష్ట్రానికి లేదని కోర్టు తీర్పు ఇచ్చింది… రాష్ట్రానికి అధికారం లేదు కాబట్టే విజయసాయి ప్రైవేట్ బిల్లు పెట్టారు.మూడు రాజధానుల పేరుతో పేటీఎం బ్యాచుతో జేఏసీ ఏర్పాటు చేశారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది తక్కువేనని.. ఇరిగేషన్ ఈఎన్సీనే చెప్పారని.. భూములున్న వారు లొంగకుంటే.. ఆ భూమి 22-A జాబితాలోకి వెళ్లిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా లేకుంటే మన ఇంటి నుంచి మనల్నే బయటకు పంపేస్తారని.. రోజా, అంబటి లాంటి వాళ్లని ముందు పెట్టి.. ఉత్తరాంధ్ర వాళ్లు వెనకుంటారా..? అని నిలదీశారు.