ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు విస్తరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఇప్పుడు కొత్తగా సచివాలయంలో ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకువచెందుకు కసరత్తు చేస్తోంది.
తొలిదశలో ఉగాది నాటికి… కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్క సచివాలయంలో ఈ ఏ టి యం సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక అన్ని జిల్లాల్లో ఒక సచివాలయం లో ఎన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించారు.
ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్ లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలో.. 3వ దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలో… ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గ్రామ లేదా వార్డు సచివాలయ శాఖ సిద్ధం అయింది. దీంతో ఈ సేవలతో.. ప్రజలకు చాలా మేలు జరుగనుంది.