నందమూరి ఫ్యామిలీ జోలికి వస్తే..జగన్‌ కు ఒక్క సీటూ రాదు – అయ్యన్న పాత్రుడు

నందమూరి కుటుంబ సభ్యులు జోలికి వెళ్తే 150 కాదు కదా ఒక్క సీట్ నీకు రాదని జగన్మోహన్ రెడ్డికి చురలకు అంటించారు అయ్యన్న పాత్రుడు. అన్న గారి కుటుంబం పై ఎంపీ విజయసాయిరెడ్డి విపరీతమైన వాఖ్యాలు చేశారని.. జగన్మోహన్ రెడ్డి లా దోచుకునే కుటుంబం నందమూరి కుటుంబానిది కాదని తెలిపారు. పింక్ డైమాండ్ చంద్రబాబు ఇంటిలో ఉందని వాఖ్యాలు చేశారు ,ఎన్నికల తరువాత అసలు పింక్ డైమాండ్ లెదు అంటున్నారని ఆగ్రహించారు.

దొంగ సర్వ్ నెంబర్ లు పెట్టి బురద జల్లారని.. చంద్రబాబు చూసి భయపడి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహించారు. వెబ్ లో మాట్లాడితే నాపై 14 కేసులు పెట్టారు మరి బహిరంగంగా మాట్లాడిన విజయసాయి పై కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్పింగ్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని.. ఆయన చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆగ్రహించారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటారో ఇంకేమైనా చేసుకుంటారో చేసుకోండని.. మీ చేతిలో పోలీసులు, అధికారం ఉంది ఎటువంటి ఎంక్వయిరీ కి అయినా రెడీ అంటూ సవాల్‌ విసిరారు.