ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అయ్యన్న?

కొంతమంది నేతలు చెప్పేది నిజమా అబద్దమా రైటా రాంగా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… కనీసం ఆ ఏదో ఒక మాటమీద కూడా నిలబడలేని పరిస్థితి తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం అదేపనిలో బిజీగా ఉన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు!

గతంలో మంత్రిగా ఉన్న రోజుల్లోనే.. విశాఖలో భూధందాలు జరుగుతున్నాయని సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఆ కబ్జాలపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న విషయం ఆయన విజ్ఞతకే వదిలేద్దాం! అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి విశాఖలో భూదందాలు బలలంగా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు అయ్యన్న!

పోనీ అదైనా నిలకడైన మాటా అంటే.. అదీ లేదు! విశాఖలో వేలాది ఎకరాలు కబ్జాకు గురి అవుతున్నాయని.. విశాఖ నుంచి భీమీలీ దాకా ఆక్రమించారని మొదలుపెట్టిన అయ్యన్న.. పాతిక వేల ఎకరాలు కబ్జా చెశారని చెప్పుకొచ్చారు. ఓహో నిజమా… అనుకుఏలోపు మళ్లీ మాట మార్చారు! ఈసారి ఆరువేల ఎకరాలు అని చెబుతున్నారు! అంతకముందు సుమారు రెండువేల ఎకరాలు అన్నారు!

ఇంతకూ అయ్యన్న చెప్పిన వాటిలో ఏది నిజం? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూదందాలు నిజమా.. వైకాపా అధికారంలోకి వచ్చాక జరుగుతున్నాయని చెబుతున్నవి నిజమా.. వాటిలో పాతిక వేల ఎకరాలు నిజమా.. ఆరువేల ఎకరాలు నిజమా.. లేక, రెండు వేల ఎకరాలు వాస్తవమా? ఏది ఫైనల్ చేసుకోమంటావు అయ్యన్నా? అంతేలే… ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? బాబు విమర్శల్లో క్లారిటీ ఉండదు.. మీ ఆరోపణల్లోనూ క్లారిటీ ఉండదు!