ఏపీలో ఆ జిల్లాలో 172 మంది ఉపాధ్యాయులకు, 262మంది విద్యార్థులకు కరోనా…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత తగ్గకుండానే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఓపెన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు విద్యార్ధుల్లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కరోనా తీవ్రత ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. జిల్లా పాఠశాలల్లో కరోనా తీవ్రత భారీగా పెరుగుతుంది. 10 రోజుల్లో 172 మంది ఉపాధ్యాయులకు, 262మంది విద్యార్థులకు కరోనా సోకింది.

వీరంతా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులే అని అధికారులు పేర్కొన్నారు. ఆన్ లైన్ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసం స్కూళ్ళకు వెళ్ళిన సమయంలో విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కేసులు పెరిగితే మాత్రం స్కూల్స్ కి సెలవలు ఇవ్వాలి అని అధికారులు భావిస్తున్నారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 382కేసులు నమోదు అయ్యాయి. రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news