మరో వివాదంలో బాలయ్య..క్షమాపణలు చెప్పాలంటూ నర్సుల డిమాండ్‌ !

సినీ నటుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాంలో సినీ నటుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకుని నర్సులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ చేసిన వాక్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. బాలకృష్ణ గతంలోనూ తనకు వైద్య సేవలు అందించిన ఒక నర్స్ పై అనుచిత వాక్యాలు చేశారని పేర్కొన్నారు. నర్సులపై చేసిన వ్యాఖ్యాలకు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?