తిరుపతిలో చిరుతల దాడులు, సంచారం చేయడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన టీటీడీ నడక మార్గాల్లో చిన్నారులు వెళ్లే సమయాన్ని కుదించింది. దీంతో పాటు భక్తులకు కర్రలు పంపిణీ చేస్తుంది. అదేవిధంగా భక్తుల సామన్లను కూడా టీటీడీ భక్తులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుంది. టీటీడీ తీరుపై తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భక్తులు తిరమలకు రాకుండా చేస్తున్నారని.. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా అని ఫైర్ అయ్యారు. వెంకటేశ్వరస్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొత్తగా నియమించిన టీటీడీ చైర్మన్ ఎవరండి ? అంటూ టీటీడీ చైర్మన్ పై కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళ కూతురు వివాహం ఏ మత సంప్రదాయంగా చేసారండి? టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్లో అతను ఏ మతానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు అండి?.. తాను నాస్తికుడిని గతంలో ఆయన చెప్పలేదా? రాడికల్ కాదా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు బండి సంజయ్. సిగ్గులేకుండా తిరుమలతో అడవులున్న విషయం తెలువదని టీటీడీ చైర్మన్ చెబుతున్నాడట. టీటీడీ చైర్మన్ కి పుష్ప సినిమా చూపించాలేమో అని ఎద్దేవా చేశారు బండి సంజయ్.