ఏపీ సీఎం జగన్‌ ను సాయం కోరిన బండ్ల గణేష్‌

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు.  అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సహాయం కోరారు బండ్ల గణేష్.

ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించాలని కోరారు. కడప జిల్లాకు చెందిన చిన్నారి అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యం చేయించేందుకు తన దగ్గర ఆర్థిక స్తోమత లేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ స్పందించారు. వైయస్ జగన్, సీఎం లో ఉండే అధికారి హరికృష్ణ ను బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు. అన్న ప్లీజ్ ఆ పాప జీవితాన్ని కాపాడండి, ఇది నా రిక్వెస్ట్ అంటూ కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news