ఆధార్ నంబర్‪ను లాక్ చెయ్యాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన చాలా లాభాలు వున్నాయి. ఏదైనా స్కీమ్ లో చేరేందుకు మొదలు ఎన్నో వాటికి ఆధార్ తప్పని సరి. ఆయితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఏదో రకంగా డేటా ని దొంగలిస్తున్నారు.

ఆధార్ నంబర్ ట్యాంపరింగ్ చాలా ప్రమాదకరం. మన బ్యాంకు అకౌంట్ల నుండి పాన్ కార్డు వరకు ఇలా చాలా వాటికి ఇలా ఏది కావాలన్నా ఆధార్ అథంటికేషన్ తప్పని సరిగా చేయించుకోవాలి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది. ఆధార్ యాక్సెస్ కనుక చేసారంటే చాలా వినియోగదారుల డేటా ని సైబర్ నేరగాళ్ల చేతి లోకి వెళ్ళిపోతోంది. అందుకనే ఆధార్ కార్డు వివరాలని భద్రపరుచుకోవాలి.

ప్రభుత్వం ఒక కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒక్క ఎస్ఎంఎస్ తో మీ ఆధార్ నంబర్ ని లాక్ చేసుకోవచ్చు. ఇక మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ఆధార్ కార్డు వున్నవాళ్లు ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ నంబర్‌లను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఒకసారి కనుక మీ ఆధార్ ని లాక్ చేసారంటే దాన్ని మళ్ళీ అన్ లాక్ చేసే దాకా ఉపయోగించేందుకు ఎవ్వడు. ఆధార్ డెమొగ్రఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ వంటి ఆథెంటికేషన్ సేవలేవీ పని చేయవు. లాక్ చేయడానికి ముందు మీరు వర్చువల్ ఐడీ ని జనరేట్ చెయ్యాలి. ఈ వర్చువల్ ఐడీ అన్ లాక్ చేసేందుకు తప్పనిసరి. ఎస్ఎంఎస్‌ తో లేదా UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఐడీ జెనరేట్ చేయొచ్చు.

GETOTP టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌ లోని చివరి 4 నంబర్లను టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చెయ్యండి.
ఇప్పుడు మీకు ఓ ఓటీపీ వస్తుంది.
ఆ తర్వాత LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి మళ్లీ పంపాలి.
అదే మీరు అన్ లాక్ చెయ్యాలంటే UNLOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మెసేజ్ చెయ్యడమే.