నేతన్న నేస్తం చేనేత కళాకారులందరికీ అమలు చెయ్యాలి – నారా లోకేష్

-

చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్‌. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం పథకాలను కట్ చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్‌.

టిడిపి ప్రభుత్వ హయాంలో చేనేతల సంక్షేమం కోసం అమలైన అనేక కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అరకొరగా కేవలం 20 శాతం మందికే అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం లబ్దిదారుల్లో మరింత కోత పెట్టేందుకు నూలు బిల్లు తప్పనిసరనే నిబంధన పెట్టడం దారుణం.కఠిన నిబంధనలు వెనక్కి తీసుకొని నేతన్న నేస్తం చేనేత కళాకారులందరికీ అమలు చెయ్యాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా విధిస్తున్న జిఎస్టి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news