తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. అయితే.. మొత్తం 1,12,683 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ చేశారు. శనివారం ఉన్నత విద్యామండలి ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దోస్త్ –2022 సీట్ల అలాట్మెంట్ వివరాలను రిలీజ్ చేశారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్‌లో 1,44,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 1.12 లక్షల మందికి సీట్లు అలాట్ కాగా, వీరిలో 45,743 మంది అబ్బాయిలు, 66, 941 మంది అమ్మాయిలు ఉన్నారు. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 6,215 మందికి సీట్లు అలాట్ కాలేదు. వెబ్ ఆప్షన్లలో ఫస్ట్ ప్రయార్టీ ఇచ్చిన కాలేజీల్లోనే 86, 791(77%) మంది సీట్లు పొందగా, సెకండ్ ఆప్షన్ ఇచ్చిన కాలేజీల్లో 25,531 మందికి సీట్లు దక్కాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 568 మంది దరఖాస్తు చేస్తే ఓపెన్ కేటగిరిలో
230 మందికి, ఈడబ్ల్యూఎస్ కోటాలో 338 మందికి సీట్లు అలాట్ చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 51 కాలేజీలను ఒక్క స్టూడెంట్ కూడా ఎంపిక చేసుకోకపోవడంతో వాటిలో అడ్మిషన్లు లేవు.
37.55% మందికి కామర్స్ కోర్సులో సీట్లు అలాట్ అయ్యాయి. ఈసారి 90.89% మంది స్టూడెంట్లు ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో చేరారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్) విధానంతో డిగ్రీలో ఏటా కోర్సులు పెరుగుతున్నాయనీ నవీన్ మిట్టల్, లింబాద్రి తెలిపారు. ఈ ఏడాది 510 కోర్సులను స్టూడెంట్లకు అందుబాటులో పెట్టినట్టు వివ రించారు. 978 కాలేజీల్లో 4,20,318 సీట్లు ఉండ గా, వాటిలో 1,12,683 మందికి సీట్లు అలాట్ అ య్యాయని, 3,07,635 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు లింబాద్రి . సెప్టెంబర్ నెలాఖరు వరకూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు లింబాద్రి . సీట్లు పొందిన వారు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో సీట్లను రిజర్వు చేసుకోవాలని సూచించారు లింబాద్రి. దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 7 నుంచి ప్రారంభమై 22వరకూ కొనసాగనుందని ప్రకటించారు అధికారులు.