బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో గవర్నర్‌ బ్రేక్‌ ఫాస్ట్‌

-

గత కొన్ని రోజులు బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పడకేసిన విషయం తెలిసిందే. అయితే.. సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే విద్యార్థులు పోరుబాట పట్టారు. అయితే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వెళ్లి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాసరలో పర్యటిస్తున్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఇవాళ్టి నుంచి యూనివర్సిటీల విజిట్ లో భాగంగా.. బాసర ట్రిపుల్ ఐటీని పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు తమిళిసై. ట్రిపుల్ ఐటీలోని క్యాంప్ లో తిరిగారు. ఐటీ మెస్, ల్యాబ్, తరగతి గదులను అధికారులతో కలిసి పరిశీలించారు తమిళిసై.

పలు విద్యార్ధులు గవర్నర్ కు సమస్యలను వివరించారు. తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఇంచార్జ్ వీసీ సహా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. అంతక ముందు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు తమిళిసై. వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకున్నారని చెప్పారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్లిన టైంలో.. పోలీసులు మీడియాను ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు తమిళిసై.

 

Read more RELATED
Recommended to you

Latest news