BREAKING : భాస్కర్‌ రెడ్డితో సహా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి అరెస్ట్

-

వైఎస్‌ వివేకానంద కేసులో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. ఇవాళ ఉదయం ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన…సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసున్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. భాస్కర్‌ రెడ్డి సహా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారని సీబీఐ తెలిపింది. అనంతరం.. పులివెందుల నుంచి తమ వాహనాల్లో హైదరాబాద్‌ కు తరలించారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే… ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పై సెక్షన్ 130బి, రెడ్ విత్ 302, 201 కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం జారీ చేశారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news