అళ్లగడ్డలో టెన్షన్‌.. ప్రేమజంటపై భూమా అఖిల బాడీ గార్డ్ దాడి !

-

నంద్యాల పరిధి అళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రేమజంట వివాదం నెలకొంది. ఓ ప్రేమికునిపై సి ఐ సమక్షంలోనే దాడి చేశాడు ఎమ్మెల్యే భూమా అఖిల బాడీ గార్డ్ నిఖిల్. అయితే.. ఈ దాడిని అడ్డుకున్నారు సిఐ. దీంతో పోలీసులతో నిఖిల్ వాగ్వాదం పెట్టుకున్నారు. చాగలమర్రికి చెందిన సాయి అనే అమ్మాయి, మైదుకూరు కు చెందిన ప్రవీణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్…మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

Bhuma Akhila body guard attack on love couple

అయితే… అమ్మాయి తరపు కుటుంబ సభ్యులకు ఈ ప్రేమ వ్యవహారం…ఇష్టం లేదు. మూడేళ్ళుగా ఇరు కుటుంబాల్లో ప్రేమ వివాదం కొనసాగుతోంది. ప్రియురాలి అన్న ఎమ్మెల్యే బాడీగార్డ్స్ తో కలిసి ప్రియుడు ప్రవీణ్ పై స్టేషన్లోనే దాడి చేయించాడు. అటు ప్రేమికులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పామంటున్నారు రూరల్ సీఐ హనుమంతు నాయక్. కానీ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించని పోలీసులు.. మీడియాను స్టేషన్‌ లోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version