బాడీగార్డ్‌పై దాడిపై భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా బాడీగార్డ్ పై నా ఇంటి ముందే హత్యాయత్నం జరిగిందని… హత్యాయత్నానికి పాల్పడ్డ వారు బయట నుంచి వచ్చిన రౌడీషీటర్లని తేలిందని తెలిపారు భూమా అఖిల. కాంట్రాక్ట్ మర్డర్లు చేసే రౌడీ షీటర్స్ టౌన్ లోకి దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు…నంద్యాల నాగేంద్ర అనే రౌడీ షీటర్ భూమా కిషోర్ రెడ్డి వెంట ఎందుకు ఉన్నాడు? అని నిలదీశారు భూమా అఖిల.
ఆ రౌడీ షీటర్ నాగేంద్ర ను కొత్తపల్లిలో వైసీపీ తరపున ఏజెంటుగా కూర్చోబెట్టాలని గంగుల కిషోర్ రెడ్డి ప్రయత్నించాడు…జరిగిన ఘటనపై నిఖిల్ కు న్యాయం చేస్తామని పోలుసులు హామీ ఇచ్చారన్నారు. రుద్రవరం లో గంగుల కుటుంబమే గొడవలు , అల్లర్లు సృష్టించింది…పక్క గ్రామాల నుండి ఆళ్లగడ్డకు మనుషులను ఎందుకు దించారో చెప్పాలన్నారు.
బౌన్సర్లను తెచ్చి మేమె ఆళ్లగడ్డలో గొడవలు అల్లర్లు సృష్టిస్తామన్న గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం…చిల్లర రౌడీలను పిలిపించి హత్యాయత్నానికి పాల్పడడం అసలైన ఫ్యాక్షనిజం కాదన్నారు భూమా అఖిల. గంగుల కిషోర్ రెడ్డి వెంట పోలింగ్ రోజు నంద్యాల రౌడీషీటర్లు ఎందుకు ఉన్నారు…ఏవి సుబ్బారెడ్డి , మరికొందరిపై 307 , SC , ST కేసు నమోదై ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని వివరించారు భూమా అఖిల.