ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని కి ఎదురుదెబ్బ తగిలింది. తన బర్త్డే రోజు మాజీ మంత్రి కొడాలి నాని కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు… ఆయన అనుచరులు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే కొడాలి నాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మరికొన్ని ఉదయం చేద్దామని అనుచరులు బయలుదేరగా… వారిని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం.. అంటే ఇవాళ జరగాల్సిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసిపి నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు… ఫ్లెక్సీలు కట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు.